కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి, లెవన్, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.
ఇప్పటికీ.. ఎప్పటికీ..
'హ్యాపీ యానివర్సరీ మై లవ్.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట కూడా పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.
ప్రేమ ఎలా మొదలైందంటే?
కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్‌లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్. ప్రముఖ రచయిత పవన్ మనవడే రాహుల్.
అలా మళ్లీ కలిశారు
వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్ కూడా యూఎస్ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.
చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే..


