పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి | Bigg Boss Shiva Jyothi Welcomes Baby on her 33rd Birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డేరోజు గుడ్‌న్యూస్‌ చెప్పిన శివజ్యోతి.. బిడ్డను ఎత్తుకుని!

Feb 14 2026 9:43 AM | Updated on Feb 14 2026 10:08 AM

Bigg Boss Shiva Jyothi Welcomes Baby on her 33rd Birthday

యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ శివజ్యోతి గుడ్‌న్యూస్‌ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్‌కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్‌డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.

ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..
తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్‌డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్‌. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement