ఓటీటీలో మనశంకర వరప్రసాద్‌గారు.. 24 గంటల్లోనే రికార్డ్ | Megastar ManaShankara VaraPrasad Garu New Record In ott | Sakshi
Sakshi News home page

ManaShankara VaraPrasad Garu: ఓటీటీలో మనశంకర వరప్రసాద్‌గారు.. 24 గంటల్లోనే రికార్డ్

Feb 13 2026 6:29 PM | Updated on Feb 13 2026 8:36 PM

Megastar ManaShankara VaraPrasad Garu New Record In ott

మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను ‍అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్‌ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్‌గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement