చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు? | Chiranjeevi Viswambhara Movie Release Update | Sakshi
Sakshi News home page

Viswambhara Movie: రెండున్నరేళ్లు గడిచిపోయాయి.. ఈ ఏడాదైనా వస్తుందా?

Feb 13 2026 3:55 PM | Updated on Feb 13 2026 4:10 PM

Chiranjeevi Viswambhara Movie Release Update

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు సినిమా కష్టాలు తప్పవు. చిరంజీవి 'విశ్వంభర' సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ ఒకటుందని జనాలు ఇప్పటికే మర్చిపోయారు. మూవీ టీమ్ నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు ఈ చిత్రం ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుందా? ఇంతకీ అసలేం జరుగుతోంది?

'బింబిసార' లాంటి సక్సెస్ తర్వాత వశిష్ఠ.. చిరంజీవితో కలిసి కొత్త మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు. 2023లో చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్టుని ప్రకటించారు. అక్టోబరు నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 2024లో ఎ‍ప్పుడైతే గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్లింప్స్‌పై విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దెబ్బకు మూవీ టీమ్‌కి సీన్ అర్థమైపోయింది. గతేడాది ఓ పాట, కొత్త గ్లింప్స్ అని మరికొన్ని అప్‌డేట్స్ వచ్చాయి గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. బజ్ రాలేదు.

(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)

మరోవైపు దీని తర్వాత చాన్నాళ్లకు అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా ప్రకటించారు. 'మన శంకరవర‍ప్రసాద్' పేరుతో గత నెలలో సంక్రాంతికి రిలీజ్ చేస్తే అద్భుతమైన హిట్ కొట్టింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త మూవీ చేసేందుకు చిరు రెడీ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కొత్త ప్రాజెక్టు గురించి ఆనందపడిపోతున్నారు. దీని గురించి రూమర్స్ చాలానే వస్తున్నాయి. ఇది కూడా వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా తీస్తున్నారని అంటున్నారు. అదే టైంలో 'విశ్వంభర' గురించి చిన్న సౌండ్ కూడా లేదు.

తాజాగా 'విశ్వంభర' నిర్మాతలే తీసిన 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదల సందర్భంగా నిర్మాతలు.. చిరు సినిమా గురించి మాట్లాడట్లేదు. 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వశిష్ఠ కూడా 'విశ్వంభర' రిలీజ్ గురించి త్వరలో చెబుతాం అంటున్నాడే తప్ప ఈ ఏడాది వస్తుందా కనీసం వచ్చే ఏడాది వస్తుందా లాంటివి క్లారిటీ ఇవ్వట్లేదు. చూస్తుంటే గ్రాఫిక్స్ విషయంలో ఇంకా సందిగ్దత అలానే కొనసాగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ రిపేర్లు ఎప్పుడు పూర్తవుతాయో? బొమ్మ ఎప్పుడు బయటకు వస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది?

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ సినిమా.. నోటిలో నుంచి రక్తమొచ్చింది: జగపతిబాబు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement