అర్జున్‌ సర్జా కామెంట్స్‌పై స్పందించిన విశ్వక్‌సేన్‌ | Actor Vishwak Sen About Arjun Sarja Comments on Him | Sakshi
Sakshi News home page

Vishwak Sen: ఇదే కదా జీవితం.. విశ్వక్‌సేన్‌ రియాక్షన్‌

Feb 13 2026 11:27 AM | Updated on Feb 13 2026 11:42 AM

Actor Vishwak Sen About Arjun Sarja Comments on Him

విశ్వక్‌ సేన్‌, అర్జున్‌ సర్జాల సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌తో రిలీజవుతున్నాయి. ఫంకీ ఫిబ్రవరి 13న విడుదలవగా సీతా పయనం ఫిబ్రవరి 14న రిలీజవుతోంది. అన్నీ కుదిరితే "సీతా పయనం"లోనూ విశ్వకే హీరోగా ఉండేవాడు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, షూటింగ్‌ కూడా మొదలుపెట్టారు! కానీ అనివార్య కారణాల వల్ల అతడు సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్‌, విశ్వక్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది.

విశ్వక్‌పై పాజిటివ్‌ రియాక్షన్‌
అయితే విశ్వక్‌తో వివాదం గురించి ఇటీవల అర్జున్‌ సానుకూలంగా స్పందించాడు. తను యువకుడు అని, తనకు చాలా భవిష్యత్తు ఉందన్నాడు. ఏదో కుదర్లేదని ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదన్నాడు. విశ్వక్‌ తల్లి చేతి భోజనం తిన్నానని, అతడు బాగుండాలని కోరుకుంటానని తెలిపాడు. కాలంతో పాటు కొన్ని మర్చిపోవాలని, రెండు సినిమాలు బాగా ఆడాలని ఆకాంక్షించాడు.

స్పందించిన విశ్వక్‌సేన్‌
ఈ వ్యాఖ్యలపై తాజాగా విశ్వక్‌ స్పందించాడు. ఆయన మాట్లాడింది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు. అదే కదా జీవితం! పైగా రెండు సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నాయి. ఆయన చాలా మంచి విషయాలు మాట్లాడాడు. అది విని నాకు మంచిగా అనిపించింది. సీతాపయనం, కపుల్‌ ఫ్రెండ్లీ సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని విశ్వక్‌సేన్‌ చెప్పుకొచ్చాడు. కాగా సీతాపయనం మూవీలో విశ్వక్‌ స్థానంలో నిరంజన్‌ నటించాడు.

చదవండి: రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. గుండె ముక్కలైందన్న హీరోయిన్‌

Advertisement
 
Advertisement
Advertisement