రూ.45 కోట్లు పెడితే రూ.1 లక్షలోపు వసూళ్లు.. హీరోయిన్‌ ఏమందంటే? | Bhumi Pednekar: The Lady Killer Flop is Very heartbreaking time in my Life | Sakshi
Sakshi News home page

Bhumi Pednekar: రూ.45 కోట్లకు రూ.1 లక్ష రాలే.. ఇప్పటికీ షాక్‌లోనే హీరోయిన్‌

Feb 13 2026 9:57 AM | Updated on Feb 13 2026 10:09 AM

Bhumi Pednekar: The Lady Killer Flop is Very heartbreaking time in my Life

కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలుస్తాయి. అలాంటి డిజాస్టరే అందుకుంది 2023లో వచ్చిన "ది లేడీ కిల్లర్‌". ఈ సినిమా వైఫల్యం గురించి తాజాగా స్పందించింది హీరోయిన్‌ భూమి పెడ్నేకర్‌. దల్‌దల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా మిడ్‌ డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భూమి పెడ్నేకర్‌ మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన స్క్రిప్ట్‌ పరిపూర్ణంగా ఉంది. కానీ, అందులో చాలా భాగాన్ని తెరకెక్కించలేదు. 

ముందే తెలిసుంటే బాగుండు
అసంపూర్తిగానే సినిమా రిలీజ్‌ చేశారు. ఇది నాకు ముందే తెలిసుంటే బాగుండేది. నేను కూడా మేకింగ్‌లో భాగమై ఉంటే కొన్ని విషయాలను మార్చగలిగేదాన్ని. అయినా జరిగినదానికి నేను షాక్‌లోనే ఉన్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. కాబట్టి ఈ సినిమా పరిస్థితేంటా? అని భయపడ్డాను. చివరకు ఇది ఒక గుణపాఠం అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. 

సినిమా షూట్‌ అవలేదు
దాదాపు 35% సినిమా షూట్‌ చేయనేలేదు. అయినా రిలీజ్‌ చేశారు. అది నా జీవితంలోనే ఎంతో బాధాకరమైన విషయం. ఈ సినిమాకిలా జరగడం నన్ను ఎంతగానో కలిచివేసింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నన్ను చాలా బాధపెట్టింది. ఇక నా పనైపోయిందనుకున్నాను. అసలు దానికి బాధ్యులెవరన్నది ఇప్పటికీ నాకర్థం కాదు అని భూమి పెడ్నేకర్‌ చెప్పుకొచ్చింది.

సినిమా
ద లేడీ కిల్లర్‌ సినిమా విషయానికి వస్తే.. అజయ్‌ భేల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌, భూమి పెడ్నేకర్‌ జంటగా నటించారు. దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.1 లక్షలోపే కలెక్షన్స్‌ రాబట్టింది. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కూడా దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో యూట్యూబ్‌లో ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు.

చదవండి: రామ్‌చరణ్‌- ఉపాసన కవలల పేర్ల వెనక అర్థం ఇదే..

Advertisement
 
Advertisement
Advertisement