‘పెద కాపు’ మూవీ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వేసవిలో విడుదల కానుంది.
ఈ మూవీ టీజర్ మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 15న రిలీజ్ కానుంది. అయితే విశేషం ఏంటంటే... హీరో మహేశ్‌బాబు చేతుల మీదుగా ఈ టీజర్‌ను లాంచ్ చేయించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే, జునైద్ కుమార్, సీఈఓ: వాసు పోతిని.


