టాలీవుడ్ హీరో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో రవితేజ, రానా, శివాజీ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా.. తనకు కాబోయే భార్యకు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఓ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి అని తేజ సజ్జా వెల్లడించారు. అంతేకాదు.. ఆమె అమెరికాలో పెరిగినట్లు తెలిపారు. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధమని.. తల్లిదండ్రులే నిశ్చయించారని వెల్లడించారు. వీరిద్దరి డిసెంబర్‌లో వివాహం జరగనుంది.రాజస్థాన్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సన్నిహితులు తెలిపారు.
The macho @RanaDaggubati along with versatile actor #RaoRamesh garu arrive at the #TejaSajjaEngagement. ❤️ Super Hero @tejasajja123 https://t.co/TkwIxR2LnJ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026


