ప్రస్తుతం ఎక్కడా చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు తేజ సజ్జా, సాయి ధరమ్ తేజ్ పెళ్లికి రెడీ అయిపోయారు. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సైతం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యమారన్‌ను ఆయన పెళ్లాడారు. తాజాగా మరో హీరో పెళ్లి చేసుకున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కుమారుడు, హీరో నిరంజన్ సుధీంద్ర పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. డాక్టర్ సంజనా రాజ్ మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుకలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. కాగా.. ఈ ఏడాది మే నెలలో వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది.
కాగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ సుధీంద్ర.. 2018లో వచ్చిన 'సెకండాఫ్' మూవీతో నటుడిగా పరిచయమయ్యాడు. 2022లో రిలీజైన 'నమ్మ హుడుగురు' మూవీలోనూ నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'సీతా పయనం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహించగా.. ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా చేసింది. భాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
#NiranjanSudhindra and Sanjana are now married! Congratulations to the couple 😍🎉 #KFI #KannadaCinema #Upendra #Latest #Trending https://t.co/FYCg8y2QM3
— Bangalore Times (@BangaloreTimes1) November 16, 2026


