టాలీవుడ్ దివంగత నటుడు శ్రీహరి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. శ్రీహరి తనయుడు సంజనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక నవంబర్ 20న జరగనుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాకుండా వధువుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. టాలీవుడ్ హీరోగా, విలన్‌గా అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయిన నటుడు శ్రీహరి. మగధీర మూవీలో షేర్ ఖాన్‌గా టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. దాదాపు వందల సినిమాల్లో నటించిన ఆయన 2013లో కన్నుమూశారు. సినిమాల్లో ఉన్నప్పుడే నటి డిస్కోశాంతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు. ప్రస్తుతం వీరి పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.


