ఇఫీలో శత జయంతి వేడుకలు | IFFI Centenary Celebrations to Honour Legends Rajkumar and Prem Nazir | Sakshi
Sakshi News home page

ఇఫీలో శత జయంతి వేడుకలు

Nov 16 2026 12:33 AM | Updated on Nov 16 2026 12:33 AM

IFFI Centenary Celebrations to Honour Legends Rajkumar and Prem Nazir

రాజ్‌కుమార్, ప్రేమ్‌ నజీర్, ఓపీ నయ్యర్‌ వంటి దిగ్గజ్జాలకు ఘన నివాళి

వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన హిందీ నటుడు రాజ్‌ కుమార్, మలయాళ  నటుడు ప్రేమ్‌ నజీర్‌లని అంత సులువుగా మరచిపోలేరు. ఇక బాలీవుడ్‌ ప్రముఖ సంగీతదర్శకులు ఓపీ నయ్యర్, రవిశంకర్‌ శర్మ (బాంబే రవిగా పాపులర్‌) తమ విలక్షణమైన సంగీతంతో శ్రోతల హృదయాలను తాకారు. అలాగే హిందీ చిత్రసీమకు చెందిన దర్శక–నిర్మాత రాజ్‌ ఖోస్లాది ఓ ప్రత్యేక స్థానం. 

మరోవైపు హిందీ, బెంగాలీలో పలు క్లాసిక్‌ చిత్రాలను రూపొందించారు దర్శక–నిర్మాత శక్తి సమంత. అదే విధంగా ‘మహా నాయక్‌’గా బెంగాలీలో ప్రసిద్ధి చెందిన నటుడు ఉత్తమ్‌ కుమార్‌. మరాఠీ పరిశ్రమలో పేరున్న నటుడు సూర్యకాంత్‌ మాంధరే. పోలాండ్‌ దేశానికి చెందిన దిగ్గజ ఫిల్మ్‌మేకర్‌ ఆండ్రేజా వాజ్దా... ఈ తొమ్మిది మంది దిగ్గజ్జాలకు ఘన నివాళి అందించనుంది ‘ఇఫీ’ (ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా).

గోవా వేదికగా ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో రాజ్‌కుమార్, ప్రేమ్‌ నజీర్, ఓపీ నయ్యర్, రవిశంకర్‌ శర్మ, రాజ్‌ ఖోస్లా, శక్తి సమంత, ఉత్తమ్‌ కుమార్, సూర్యకాంత్‌ మాంధరేల శత జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ 57వ ‘ఇఫీ’ వేడుకలు ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement