టాలీవుడ్ నటుడు రవిబాబు బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లోనే ఓ హారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాకు స్కేరీ పిక్చర్ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ చూస్తేనే హారర్ థ్రిల్లర్ సినిమా అని అర్థమవుతోంది. అయితే ఈ మూవీ వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా రిలీజ్ కావొచ్చని క్యాప్షన్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన తెలుగు పోస్టర్ విడుదల చేయకపోవడంతో.. ఆడియన్స్‌లో కేవలం బాలీవుడ్‌లో మాత్రమే విడుదల కానుందా అనే సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
A new nightmare is about to unfold. Dr. D. Ramanaidu presents SCARY PICTURE, starring Kangana Ranaut. A Flying Frogs Production. D. Suresh Babu | Ravi Babu ANYTIME 2027. #ScaryPicture @KanganaTeam @SureshProdns #FlyingFrogs #ScaryPicture2027 https://t.co/FbTWIvJ1rL
— Suresh Productions (@SureshProdns) November 13, 2026


