వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణ.. పుష్ప-2 రికార్డ్ జస్ట్ మిస్ | Ramayana Creates Record at box office Breaks Baahubali 2, Animal and Pathaan | Sakshi
Sakshi News home page

Ramayana Movie: వెయ్యి కోట్ల రామాయణ.. పుష్ప-2 రికార్డ్ జస్ట్ మిస్

Nov 13 2026 12:36 PM | Updated on Nov 13 2026 12:42 PM

Ramayana Creates Record at box office Breaks Baahubali 2, Animal and Pathaan

రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన రామాయణ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం రిలీజైన ఎనిమిది రోజుల్లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్క్ దాటేసింది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన 11వ చిత్రంగా రామాయణ నిలిచింది. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడవ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇదేక్రమంలో పఠాన్, యానిమల్ సినిమాల జీవితకాల బాక్సాఫీస్ వసూళ్లను అధిగమించింది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూస్తే రూ. 675.05 కోట్ల గ్రాస్ రాబట్టగా.. రూ. 564.60 కోట్ల నికర వసూళ్లను దాటింది.  ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం 8వ రోజు అన్ని భాషల్లో కలిపి రూ. 53.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌లో రూ. 358.50 కోట్లు రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 1,033.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

కేవలం ఎనిమిది రోజుల్లో  అత్యంత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రంగా రామాయణ నిలిచింది. దీనికంటే ముందు 'పుష్ప 2: ది రూల్', 'ధురందర్: ది రివెంజ్' (ఏడు రోజులు) మాత్రమే ముందున్నాయి. ఇదే క్రమంలో 'బాహుబలి 2: ది కంక్లూజన్' (10 రోజులు), 'ఆర్ఆర్ఆర్' (16 రోజులు), 'జవాన్' (18 రోజులు) లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులను అధిగమించింది.

కాగా.. ఈ చిత్రంలో యశ్ రావణుడిగా కనిపించారు. ప్రముఖ నటుడు రవీ దూబే లక్ష్మణుడిగా అలరించారు. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో మెప్పించగా.. మండోదరిగా కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ మూవీ సీక్వెల్‌లో కూడా సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement