టైటిల్: దొంగ నా కొడుకు(డీఎన్ కే )
నటీనటులు: మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి, అలీ, రజిత తదితరులు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్నిర్మాతలు: నవీన్
దర్శకత్వం: శ్రీను కంబాల
సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
విడుదల తేదీ: 2026 నవంబర్ 13
స్వతహాగా యూట్యూబర్ అయిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి మూవీతోనే అద్భుతమైన హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు హీరోగా చేసిన రెండో చిత్రం 'దొంగ నా కొడుకు'. సెన్సార్ సమస్య వల్ల పేరుని 'డీఎన్‌కే' మార్చి థియేటర్లలో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? మౌళి హిట్ కొట్టాడా లేదా?
(ఇదీ చదవండి: 'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ)
కథేంటంటే?
విశాఖపట్నంకు చెందిన ఈశ్వర్ (మౌళి) బీటెక్ మధ్యలోనే ఆపేసి బెట్టింగ్‌కి బానిస అవుతాడు. లోన్ యాప్స్ ద్వారా అప్పులు చేయడమే కాదు లవర్ దీపు (సుష్మిత శెట్టి) దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడు. ఈ వ్యవహారం ఆమె తండ్రికి తెలియడంతో సమస్యలు మొదలవుతాయి. అప్పులు తీర్చడానికి స్నేహితుడితో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఓ జ్యూవెల్లరీ షాపులో దొంగతనంతో సీన్ మారిపోతుంది. ఈశ్వర్ కుటుంబం దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అతడు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? జ్యూవెల్లరీ షాప్ దొంగతనం వెనుకున్న కథేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
క్రైమ్ కథకు కామెడీని జోడించాలనే ఆలోచన బాగుంది. కానీ దర్శకుడు ఆ రెండింటినీ పూర్తిస్థాయిలో బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో ఈశ్వర్ చేసే పనులు, లోన్ యాప్‌లతో వచ్చే ఇబ్బందులు, ప్రేమ వ్యవహారం వంటి కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. మౌళి కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ కామెడీ కంటే గందరగోళం ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. వరుసగా ట్విస్టులు వస్తున్నా సరే అవి పెద్దగా సర్‌ప్రైజ్ చేయవు. కొన్ని చోట్ల కామెడీ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇదే సినిమాకు ప్రధాన మైనస్‌గా నిలిచింది. కామెడీ సినిమా అయినా ఎక్కడా నవ్వు రాకుండా దర్శకుడు చాలా 'జాగ్రత్త' పడి సినిమా తీశాడు.
ఎవరెలా చేశారంటే?
మౌళి తన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్‌తో ఈశ్వర్ పాత్రకు సరిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో అతని నటన బాగానే నవ్విస్తుంది. బబ్లూ కూడా హీరో స్నేహితుడి పాత్రలో ఆకట్టుకుంటాడు. అలీ, రజిత తమ పరిధిలో మెప్పించారు. హీరోయిన్ సుష్మిత శెట్టికి మాత్రం పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో పెద్దగా గుర్తుండిపోయే అవకాశం లేదు. సాంకేతికంగా సినిమా పర్లేదు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ ఓకే. సింజిత్ యెర్రమిల్లి నేపథ్య సంగీతం సినిమాకు కొంత బలం. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. అనవసరమైన సన్నివేశాలను కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
(ఇదీ చదవండి: సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ)


