breaking news
Mouli Tanuj
-
లిటిల్ హార్ట్స్ మౌళికి భారీ రెమ్యునరేషన్‌తో మైత్రీ సినిమా!
లిటిల్ హార్ట్స్ (Little Hearts)సినిమాతో నటుడు మౌళి(Mouli Tanuj ) భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో యూత్‌కు బాగా దగ్గరైన మౌళి తన టైమింగ్ డైలాగ్స్‌తో గుర్తింపు సంపాదించాడు. హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా తనతో ఒక సినిమా చేద్దాం అనుకునే రేంజ్‌కు చేరుకున్నాడు. కొత్త దర్శకులు కూడా ఇప్పటికే స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ నిర్మాణ సంస్థ నుంచి మౌళికి బిగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.చిన్న సినిమాగా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. దీంతో అతని మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు మౌళికి ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా ఆఫర్ ఇవ్వడమే కాకుండా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి రెమ్యునరేషన్ కూడా వారు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడం పెద్ద విషయమేనని చెప్పాలి. ఒక సినిమా హిట్ అయినప్పటికీ మరో ఛాన్స్ రావడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ తన వద్దకే వచ్చి ఇలా ఆఫర్ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. దీనంతటికీ కారణం మౌళికి యూత్‌తో బాగా కనెక్ట్ ఉంది. సోషల్‌మీడియాలో భారీ ఇమేజ్ ఉంది. అందుకే తనకు మైత్రీ మూవీస్ సినిమా అవకాశం ఇచ్చినట్లు టాక్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో రావచ్చు. -
రౌడీ టీ షర్ట్.. మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్
సినిమా ఇండస్ట్రీ అనేది చూడటానికి బాగానే ఉంటుంది గానీ లోపల చాలా సంగతులు జరుగుతుంటాయి. అవన్నీ సామాన్య ప్రేక్షకుడికి తెలిసేది తక్కువే. ఎప్పుడో ఎవరో ఒకరు బయటకు చెబితే అలాంటివి వైరల్ అవుతుంటాయి. తాజాగా నటుడు-నిర్మాత బండ్ల గణేశ్ అలాంటి వాటి గురించి మాట్లాడారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్ గురువారం సాయంత్రం జరగ్గా.. ఇందులో హీరో మౌళిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.'ఈ 20 రోజులు జరిగింతా అబద్ధం, ఓ కల్పన. కళ్లజోడు తీసేయ్. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎలా అయితే ఉన్నావో అలానే ఉండు. ఎవరేం చెప్పినా నమ్మకు. నువ్వు ఓ చంద్రమోహన్‌లా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నాను. ఈ ఫిల్మ్ నగర్, ఈ సినిమా, ఈ ట్వీట్స్, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికెళ్లిన తర్వాత వాస్తవానికి వెళ్లిపో.. లేదంటే ఈ మాఫియా మనల్ని బతకనివ్వదు. ఈ మాఫియాకు దూరంగా ఉండాలంటే మన బేస్ మీదే ఉండాలి. ఎవడు బాగుంటే.. అబ్బబ్బా ఎంత పొడుగుందో అని అంటారు. అవన్నీ నమ్మకు'(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)'రౌడీ టీ షర్ట్ ఇచ్చాడు. మహేశ్ బాబు ట్వీట్ వేశాడు. బండ్ల గణేశ్ అవి వేశాడు. ఇవన్నీ అబద్ధాలు. నిన్ను ఆశీర్వదించడానికి, నీకు విషెస్ చెప్పడానికి అలా చేస్తారు. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వస్తాడు. ప్రతిదానికి సిద్ధమై ఉండు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు. ఎవరినీ నమ్మకు. నమ్మినట్లు ఉండు. వాస్తవంగా బతుకు. అద్భుతంగా సినిమాలు చేసుకో. నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మనాన్న తలెత్తుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడేలా మనస్పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.బండ్ల గణేశ్ చెప్పిన వాటిలో పచ్చి నిజాలు బోలెడన్ని ఉన్నాయి. కానీ ఆయన ఇలా డైరెక్ట్‌గా చెప్పేసరికి అందరూ షాకయ్యారు. 'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని హీరోహీరోయిన్లుగా నటించగా సాయి మార్తాండ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. రెండున్నర కోట్లతో మూవీ తీస్తే రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. (ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?)"ఈ మాఫియా నిన్ను బతకనివ్వదు..."A life lesson by #BandlaGanesh 👏Only he has the guts to speak facts like this. pic.twitter.com/kMqCTPciXG— Movies4u Official (@Movies4u_Officl) September 18, 2025 -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్‌తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్‌డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్‌లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్‌లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్‌లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్) -
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్‌లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తారు. అక్కడే అఖిల్‌కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్‌స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్‌డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్‌ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్‌లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.