
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్‌లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.
(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)
'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్‌లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.
'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.
(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్)