హిందీ వెబ్ సిరీస్‪‌లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్ | The Bads Of Bollywood Trailer OTT | Sakshi
Sakshi News home page

OTT: షారుఖ్ ఖాన్ కొడుకు డైరెక్షన్.. బాలీవుడ్ అంతా ఒకే సిరీస్‌లో

Sep 8 2025 3:39 PM | Updated on Sep 8 2025 3:57 PM

The Bads Of Bollywood Trailer OTT

రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ మధ్య కాలంలో యాడ్స్, ఈవెంట్స్‪‌లో తరుచుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ హిందీ వెబ్ సిరీస్‌లోనూ జక్కన్న నటించడం విశేషం. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో ఈ విషయం బయటపడింది.

(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దర్శకుడిగా మారి తీసిన సిరీస్ 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. హిందీ చిత్రసీమలో తెరవెనక జరిగే సంగతుల్ని ఆధారంగా చేసుకుని కామెడీ ఎంటర్‪‌టైనర్‌గా దీన్ని తీశాడు. సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ సీన్‌లో ఆమిర్ ఖాన్, రాజమౌళి కనిపించారు. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్, దిశా పటానీ, షారుఖ్ ఖాన్, ర్యాపర్ బాద్ షా కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement