తెలుగు స్టార్ హీరో జూ.ఎన్టీఆర్.. ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించాడు. వ్యక్తిత్వ హక్కులని రక్షించుకోవడంలో భాగంగానే పిటిషన్ వేశాడు. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై.. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలానే తదుపతి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ అరోరా చెప్పారు.
(ఇదీ చదవండి: 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. నందమూరి హీరో ఏమైపోయాడు?)
ఇటీవల కాలంలో ఇలానే చిరంజీవి, నాగార్జున కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే జూ.ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోని ఉపయోగిస్తే ఆలోచించాల్సిందే అనమాట.
ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇది థియేటర్లలోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చిత్రీకరణ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ తదితర దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)


