'ప్రభాస్ ఇప్పటికీ సిగ్గుపడతాడు'.. మంగళవారం బ్యూటీ క్యూట్ పోస్ట్! | Payal Rajput Praises tollywood Rebal star Prabhas | Sakshi
Sakshi News home page

Payal Rajput: 'ఇంత ‍అమాయకంగా ఎలా ఉంటారు?'..ప్రభాస్‌పై పాయల్‌ ప్రశంసలు

Dec 8 2025 4:05 PM | Updated on Dec 8 2025 4:20 PM

Payal Rajput Praises tollywood Rebal star Prabhas

మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆర్‌ఎక్స్‌100 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. మంగళవారం మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టేసింది. గతేడాది రక్షణ చిత్రంలో కనిపించిన భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ నెట్టింట చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఎవరైనా అంత అమాయకంగా ఎలా ఉండగలరు? అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటోలను షేర్ చేసింది. సినీ ఇండస్ట్రీ మనల్ని చాలా కఠినంగా మార్చుతుంది.. అంతేకాదు మంద చర్మం గలవారిగా మార్చేస్తుంది. అయినప్పటికీ ఈ వ్యక్తి మాత్రం ఇప్పటికీ సిగ్గుపడతాడు.. అతని సిగ్గువల్ల చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అతను అంత ముద్దుగా ఉంటాడా?  దేవుడు అతన్ని దీవించునుగాక.. అంటూ ప్రభాస్‌ సో క్యూట్‌ తెగ పొగుడుతూ ట్వీట్ చేసింది ముద్దుగుమ్మ. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement