మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి ఏకంగా 15కి పైగా తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కార్తీ 'అన్నగారు వస్తారు'.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి 'రీతూ' ఎలిమినేట్.. విన్నర్ రేంజ్‌లో రెమ్యునరేషన్)
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1'తో పాటు త్రీ రోజెస్ సీజన్ 2 అనే తెలుగు వెబ్ సిరీస్ ఉన్నంతలో చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 8 నుంచి 14 వరకు)
నెట్‌ఫ్లిక్స్
ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 08
మ్యాన్ vs బేబీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11
గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12
ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12
వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12
హాట్‌స్టార్
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 11
అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)
అమెజాన్ ప్రైమ్
ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 08
ద లాంగ్ వాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08
మెర్వ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10
టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12
ఆహా
3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12
జీ5
సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12
సన్ నెక్స్ట్
అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12
సోనీ లివ్
రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ సిరీస్) - డిసెంబరు 09
ఆపిల్ టీవీ ప్లస్
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12
మనోరమ మ్యాక్స్
ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12
(ఇదీ చదవండి: ఆస్తి మొత్తం తిరుమలకు ఇచ్చేసిన అలనాటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం)


