క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఈ మూవీకి వెంకట్ త్రినాథ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు బాబు మోహన్ హాజరయ్యారు.
బాబు మోహన్ మాట్లాడుతూ... 'అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా మేము ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నిర్మాతలు నన్నే దర్శకత్వం వహించమన్నారు. ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ సినిమాను పూర్తి చేశాం. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. నా తొలి చిత్రానికి ఇంతగా సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. హీరో అవి తేజ్ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో నటించారు. ఈ సినిమా చూసి మీరు ఫీల్ గుడ్ అవుతారని హామీ ఇవ్వగలను. ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా" అని అన్నారు.
డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాత కుమార్ అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, కోయల్ దాస్ కీలక పాత్రల్లో నటించారు.


