బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ నటించారు. ఈ చిత్రం పార్ట్-2 మార్చి 19, 2026న విడుదల కానుంది.


