హిందీ ‘బిగ్‌బాస్ 19’ ముగిసింది. ఈ సీజన్‌లో గౌరవ్ ఖన్నా (43) విజేతగా నిలిచారు. బాలీవుడ్ బుల్లితెర నటుడిగా, యాంకర్‌గా ఆయనకు చాలా గుర్తింపు ఉంది. CID వంటి పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ సీరిస్‌లో ఆయన నటించారు. గతేడాదిలో జరిగిన సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో కూడా ఆయన 12మందితో పోటీ పడి విజేతగా నిలిచారు. ఇప్పుడు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి బాలీవుడ్‌లో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఈ సీజన్ సుమారు 100రోజులకు పైగానే కొనసాగింది. టాప్-5లో అమల్ మల్లిక్, తాన్యా మిట్టల్, గౌరవ్ ఖన్నా, ప్రణిత్ మోర్, ఫర్హానా భట్ నిలిచారు. అయితే, ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 విజేతగా నిలిచిన గౌవర్ ఖన్నా ట్రోఫీతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు. ఫర్హానా భట్ మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ వేడుకలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే తమ రాబోయే చిత్రం తు మేరీ మై తేరా మై తేరా తు మేరీని ప్రమోట్ చేయడానికి కనిపించారు. స్ప్లిట్స్‌విల్లా X6ని ప్రమోట్ చేయడానికి సన్నీ లియోన్, కరణ్ కుంద్రా కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
Gaurav Khanna’s Winning Moment I’m Literally Crying! He’s The First Truly Dignified Contestant To Become The Winner Loved It 😭❤#GauravKhanna • #BiggBoss19 • #BB19pic.twitter.com/7EAFJd0Bl5
— 𝓐𓄂 (@Advik_Verse) December 7, 2025


