కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు హిట్ అని మేకర్స్ ఘనంగా చెప్పుకొంచారు. కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టేశాడు అని హడావుడి చేస్తారు. తీరా చూస్తే కొన్నిరోజులకు అసలు ఫలితం ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్‌ని వంకపెట్టడానికి ఏం లేనప్పటికీ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడంతో చాలావరకు ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది విజయ్ నుంచి 'కింగ్డమ్' వచ్చింది. మే చివరలో థియేటర్లలో రిలీజైంది.
(ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
విడుదల రోజు.. విజయ్ హిట్ కొట్టేశాడని రష్మిక పోస్ట్ పెట్టింది. తొలిరోజు మూవీ చూసిన చాలామంది కూడా బాగుందనే అన్నారు. కానీ రెండో రోజు నుంచి యావరేజ్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రూ.130 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. తొలి భాగంలో కొంత కథ చూపించారు. కాకపోతే పెట్టిన బడ్జెట్‌కి వచ్చిన వసూళ్లకు పొంతన కుదరలేదు. దీంతో ఇప్పుడు రెండో భాగాన్ని పక్కనబెట్టేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'కింగ్డమ్' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 'మ్యాజిక్' అనే చిన్న సినిమా తీశాడు. దీన్ని విడుదల చేసే పనుల్లో ఉన్నాడు. 'కింగ్డమ్' సీక్వెల్ లెక్క ప్రకారం వచ్చే ఏడాది మొదలవ్వాలి. కానీ అది ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది కొన్ని నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
(ఇదీ చదవండి: గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు)


