నటుడిగా విజయ్ సేతుపతి వైవిధ్యమైన పాత్రలు చేస్తుంటారు. నటిగా సాయి పల్లవి ఎంచుకునే పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసిందే. ఇలా విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్న ఈ ఇద్దరి జోడీ ఒక సినిమాకి కుదిరిందని చెన్నై అంటున్న మాట. అది కూడా మణిరత్నం దర్శకత్వంలో అని ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేమకథా చిత్రం అని సమాచారం. విజయ్ సేతుపతి – సాయి పల్లవి ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట.
జనవరిలో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించి, షూటింగ్‌ని ఏప్రిల్‌లో ప్రారంభిస్తారట. ఒకవేళ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి – సాయి పల్లవి నటించనున్నారనే వార్త నిజమైతే... ‘నవాబ్’ తర్వాత ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతికి ఇది రెండో చిత్రం అవుతుంది. మణిరత్నం డైరెక్షన్‌లో సాయి పల్లవికి ఇది తొలి చిత్రం అవుతుంది.


