రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే! | Did Gaurav Khanna Receive Rs 50 Lakh for Winning Bigg Boss 19? | Sakshi
Sakshi News home page

Gaurav Khanna: రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇంకా చేతికి రాలేదా?

Mar 11 2026 11:31 PM | Updated on Mar 11 2026 11:31 PM

Did Gaurav Khanna Receive Rs 50 Lakh for Winning Bigg Boss 19?

బుల్లితెర నటుడు గౌరవ్‌ ఖన్నా హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్‌గా రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!

ఇదెప్పుడూ ఉండేదే..
ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్‌లో వెల్లడించాడు. గౌరవ్‌ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్‌మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. 

రెండు నెలల్లో..
కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్‌.. సెలబ్రిటీ మాస్టర్‌ చెఫ్‌ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. ఆ వెంటనే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.

చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్‌

Advertisement
 
Advertisement
Advertisement