breaking news
Gaurav Khanna
-
పెళ్లయి 9 ఏళ్లు.. ఇంకా పిల్లలు వద్దంటోంది: నటుడు
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ (Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను లాంచ్ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారిలో బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) ఒకరు! తాజాగా ఓ ఎపిసోడ్లో యూట్యూబర్ మృదుల్ తివారీతో తన కుటుంబ విషయాలను చర్చించాడు. నా భార్య పేరు ఆకాంక్ష చమోలా (నటి).. ఈ ఏడాది నవంబర్ నాటికి మా వైవాహిక జీవితానికి 9 ఏళ్లు నిండుతాయి అని చెప్పాడు.పిల్లలంటే ఇష్టం.. భార్య వద్దంటోందిఎంతమంది పిల్లలు అని మృదుల్ అడగ్గా.. ఎవరూ లేరని బదులిచ్చాడు గౌరవ్. నా భార్య పిల్లలు వద్దంటోంది. కానీ, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. కాబట్టి తనేం చెప్పినా నేను ఒప్పుకుని తీరాల్సిందే! ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలను మనం గౌరవించాల్సిందే! తను అన్నదాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే మాపై చాలా బాధ్యతలున్నాయి. నేను షూటింగ్స్ కోసం రోజంతా బయటే ఉండాల్సి వస్తుంది. తను కూడా షూటింగ్స్‌తో బిజీగా ఉంటుంది. ఎవరు చూసుకుంటారు?అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుంటే వారిని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యతను బయటవారికి అప్పజెప్పడం మాకిష్టం లేదు. ఓసారి నాకు పిల్లలు కావాల్సిందేనని తన దగ్గర పట్టుపట్టాను. అప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక తను చెప్పింది కూడా కరెక్టే అనిపించి చైల్డ్ ప్లానింగ్ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.దాంపత్యానికి 9 ఏళ్లుగౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షోలో పాల్గొని టైటిల్ గెలిచాడు. ఆ షోలోనే ఆకాంక్షతో ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్లో ఆమెను తొలిసారి చూడగానే లవ్‌లో పడ్డానని, అలా అతడే ధైర్యం కూడదీసుకుని ఓ అడుగు ముందుకేసి ఆమెతో మాట కలిపానని తెలిపాడు. అలా తమ జర్నీ పెళ్లివరకు వచ్చిందన్నాడు. గౌరవ్- ఆకాంక్ష 2016లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. -
సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో ?
రుచికరమైన వంటకాలు, కబుర్లు ,కాకర కాయలతో ఇంతకాలం అలరించిన ‘‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’’కు శుభం కార్డు పడింది. తమ అభిమాన ఓటీటీ తారలు ఈ సిరీస్‌లో పాక నిపుణులుగా రూపాంతరం చెందడాన్ని చూసి అభిమానులు మురిసిపోయారు. ఫరా ఖాన్, వికాస్ ఖన్నా, రణవీర్ బ్రార్ న్యాయ నిర్ణేతలుగా ఉన్న సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 11న గ్రాండ్‌గా జరిగింది. ఇంతకీ ఈ షో విజేత ఎవరు, ప్రైజ్‌మనీ ఎంత? ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి!ప్రముఖ టెలివిజన్ నటుడు, అనుపమ పాత్రతో పాపులర్ గౌరవ్ ఖన్నా ఈ షో విజేతగా నిలిచాడు. సీజన్‌తో తనదైన శైలితో ఆకట్టుకున్న గౌరవ్ చివరి ధశలో కూడా న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాడు. సిగ్నేచర్ డిష్‌లు, రుచులు, స్టైల్తోమాత్రమే కాకుండా, కాన్పూర్ నుంచి ముంబై దాకా సాగిన భావోద్వేగ ప్రయాణం గురించి పంచుకున్న కథ కూడా అటు ప్రేక్షకులను, ఇటు న్యాయనిర్ణేతల హృదయాలనూ కదిలించింది. దీంతో ఫలితాలు ప్రకటిస్తూ గౌరవ్‌ను వారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నలుగురు హేమాహేమీలను ఓడించి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని దక్కించుకున్నాడు గౌరవ్. ఫలితంగా రూ. 20 లక్షల నగదు బహుమతి, ప్రీమియం కిచెన్ ఉపకరణాలను గెలుచుకున్నాడు.నెమ్మదిగా ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన వంటకాలను నేర్చుకుని అందించి ఈ రోజు ఈ స్థానానికి చేరుకున్నాడు.ఇది నా మొదటి రియాలిటీ షో" నేను ఎప్పుడూ కెమెరా ముందు ఏడవలేదు, అంటూ కన్నీళ్లతో తన కథను చెప్పి అందరిచేత కన్నీళ్లు పెట్టించాడు. ఈ సందర్బంగా ఫినాలేలో అతిథిగా వచ్చిన చెఫ్ సంజీవ్ కపూర్, మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎమోషన్స్‌కి దూరంగా పారిపోతూ ఇక్కడి దాకా వచ్చి వుంటావ్... ఇపుడిక భావోద్వాగాల్ని కూడా మిళితం చేస్తూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టు ("అబ్ తక్ షాయద్ ఎమోషన్స్ సే భాగ్ కర్ యహాన్ తక్ పోహ్చే హో. ఆజ్ సే జిందగీ షురూ కరో, ఎమోషన్స్ సే జుడ్ కే") అని సలహా ఇచ్చారు.తీవ్రమైన పోటీ మధ్య గౌరవ్ తన ఆవిష్కరణ, సాంకేతికత , నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచారు. సాంకేతిక సవాళ్లను నేర్చుకోవడం నుండి ప్రస్తుతం వైరల్‌గా మారిన హనీకాంబ్ పావ్లోవా వంటి క్లిష్టమైన డెజర్ట్‌లను తయారు చేయడం వరకు, గౌరవ్ అతని పాక నైపుణ్యం, ప్రయాణం విశేషంగా నిలిచింది. అతని నటనా చాతుర్యంతోపాటు, వంటగదిలో నైపుణ్యం, ప్రావీణ్యం ఆశ్చర్యకరమైన ప్రతిభ, అభిమానులు . ఆహార విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది.స్టార్-స్టడెడ్ పోటీదారుల జాబితాలో ఆయేషా జుల్కా, అభిజీత్ సావంత్, ఉషా నద్కర్ణి, అర్చన గౌతమ్, చందన్ ప్రభాకర్, కబితా సింగ్, దీపికా కాకర్ తదితరులు ఉన్నారు.కాగా సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తొలి సీజన్ ఈ ఏడాది జనవరి 27న మొదలైంది. ఏప్రిల్ 11న ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలేలో, నిక్కీ తంబోలిని తొలిరన్నరప్‌గా నిలవగా, తేజస్వి ప్రకాష్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫైసల్ షేక్ , రాజీవ్ అడాటియా మొదటి ఐదుగురు ఫైనలిస్టుల జాబితాలో నిలిచారు. ఈ ఫైనల్‌కు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.సెలబ్రిటీ చెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్‌లతో కలిసి ఫైనలిస్టుల తుది వంటకాలను రుచి చూసి,విజేతలను ఎంపిక చేశారు. ఫరా ఖాన్ హోస్ట్ చేసిన ఈ షో కామెడీ, వంటల మేళవింపుతో మధురక్షణాలతో రోలర్‌కోస్టర్‌గా సాగింది.