కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలు కావాలనుకోరు. ముందుగా కెరీర్‌లో స్థిరపడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకుంటారు. కానీ అసలు పిల్లలే వద్దనుకునేవారు చాలా తక్కువమంది. హిందీ బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) భార్య ఆకాంక్ష (Akanksha) ఈ కోవలోకే వస్తుంది. గౌరవ్ హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొన్నాడు.
తల్లవ్వాలన్న ఆశ లేదు
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆకాంక్ష చమోలా హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వీరి తొమ్మిదో పెళ్లి రోజును హౌస్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు తల్లవ్వాలన్న ఆశ లేదంది ఆకాంక్ష. ఆ మాట విని గౌరవ్ నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ అని పిలిపించుకోవాలని నాకెప్పుడూ అనిపించడలేదు. భవిష్యత్తులో కూడా పిల్లల్ని ప్లాన్ చేయాలనుకోవడం లేదు.
చాలా కారణాలు
పిల్లలుంటే బాగుండన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఇలా పిల్లలు వద్దనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏదో వంటకం చేసినంత ఈజీ కాదు. అది పెద్ద బాధ్యత. నేను దానికి న్యాయం చేయలేను అని నా ఫీలింగ్. ఇప్పుడే కాదు, ఇకముందు కూడా ఆ బాధ్యత నిర్వర్తించలేను. ప్రస్తుతం నాకు నా కెరీర్ ముఖ్యం. నాకు చాలా లక్ష్యాలున్నాయి.
నా కెరీర్ ముఖ్యం
జనాలు నన్ను స్వార్థపరురాలిని అనుకున్నా మరేం పర్లేదు. నాకు నా కెరీర్ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. అది విన్న గౌరవ్.. నీ సమాధానం తనను మరింత భయపెడుతుందన్నాడు. గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షో విజేతగా నిలిచాడు. గౌరవ్ - ఆకాంక్ష 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
చదవండి: రీతూని నిలదీసిన తల్లి


