23 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే! | Rohit Shetty About Not winning a Single Award Despite 17 Films | Sakshi
Sakshi News home page

అవార్డులకు, నాకు మధ్య ఏ బంధమూ లేదు: బాలీవుడ్‌ దర్శకుడు

Jan 8 2026 1:10 PM | Updated on Jan 8 2026 1:20 PM

Rohit Shetty About Not winning a Single Award Despite 17 Films

బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఎన్నో హిట్స్‌ ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తను డైరెక్ట్‌ చేసిన సినిమాలు అవార్డులు గెలిచాయి కానీ ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. తాజాగా భారత జాతీయ సినీ అకాడమీ (NICA) ప్రెస్‌మీట్‌కు హాజరైన రోహిత్‌ శెట్టి ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

యాంకరింగ్‌ చేయమని..
ఆయన మాట్లాడుతూ.. నాకు, అవార్డులకు మధ్య సంబంధమే లేదు. ఇప్పటివరకు 17 సినిమాలు తీశాను. అవార్డు ఫంక్షన్‌కు పిలుస్తుంటారు, కానీ హోస్ట్‌గా చేయమని మాత్రమే ఇన్విటేషన్‌ వస్తుంటుంది. అలా అవార్డుల ఫంక్షన్‌లో యాంకర్‌గా మాత్రమే కనిపించాను అన్నాడు.

ఎప్పుడో మొదలైంది
నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సినిమా రిలీజైతే పండగ చేసుకోవాలి. సినిమా అనేది మొదలైనప్పటినుంచే ఇక్కడి వాళ్లు దక్షిణాదిలో.. దక్షణాదివాళ్లు బాలీవుడ్‌లో సినిమాలు తీస్తున్నారు. 1950 నుంచే ఇదంతా జరుగుతోంది. మనం ప్రాంతీయ బేధాలు చూడకుండా సినిమా సెలబ్రేట్‌ చేసుకోవాలి. సోషల్‌ మీడియా వల్ల ప్రపంచమే చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అందరూ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేసి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పుకొచ్చాడు.

సినిమా
రోహిత్‌ శెట్టి.. జమీన్‌, గోల్‌మాల్‌, సింగం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, సింగం రిటర్న్స్‌, సూర్యవంశీ, సర్కస్‌.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్‌ సినిమా తీశాడు. అజయ్‌ దేవ్‌గణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, కరీనా కపూర్‌, అక్షయ్‌ కుమార్, దీపికా పదుకుణె, టైగర్‌ ష్రాఫ్‌, అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి 'గోల్‌మాల్‌' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.

చదవండి: హీరో తరుణ్‌ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement