ప్రకృతి నాకేదో సిగ్నల్స్ ఇస్తోంది.. ఫన్నీగా 'బ్యాండ్ మేళం' టీజర్ | Band Melam Movie Teaser | Sakshi
Sakshi News home page

Band Melam Teaser: 'కోర్ట్' జోడీ చేసిన టీనేజ్ లవ్‌స్టోరీ.. సినిమా టీజర్ రిలీజ్

Feb 24 2026 5:59 PM | Updated on Feb 24 2026 6:05 PM

Band Melam Movie Teaser

గతేడాది రిలీజైన 'కోర్ట్' సినిమాతో ఆకట్టుకున్న రోషన్-శ్రీదేవి.. మరోసారి జంటగా నటించిన మూవీ 'బ్యాండ్ మేళం'. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో దీన్ని తెరకెక్కించారు. సతీష్ జవ్వాజీ దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. మార్చి 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)

'బ్యాండ్ మేళం' సినిమా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ. బావమరదలు అయిన హీరోహీరోయిన్ మధ్య గిల్లికజ్జాలు, ప్రేమ, బ్రేకప్ లాంటివి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులైన రోషన్, శ్రీదేవి చూడటానికి బాగానే ఉన్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?

(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

Advertisement
 
Advertisement
Advertisement