అయ్యప్ప మాలలో చరణ్‌.. పార్టీ వివాదంపై శిరీష్‌ క్లారిటీ | Allu Sirish clarified on Ram Charan Celebrate Party with Ayyappa Mala | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మాలలో చరణ్‌.. పార్టీ వివాదంపై శిరీష్‌ క్లారిటీ

Feb 24 2026 12:41 PM | Updated on Feb 24 2026 12:52 PM

Allu Sirish clarified on Ram Charan Celebrate Party with Ayyappa Mala

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్‌-నయనికల వివాహం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌ తన నివాసంలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. అందులో రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. అయ్యప్పమాలలో ఉన్న రామ్‌ చరణ్‌ మద్యం పార్టీలో పాల్గొనడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ సమాధానం ఇచ్చారు.

చరణ్‌ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చారు. ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు సమాధానంగా ఆయన రిప్లై ఇచ్చారు. పార్టీ ప్రారంభం కాకముందే రామ్‌ చరణ్‌ అక్కడికి వచ్చి వెళ్లిపోయారని అల్లు శిరీష్‌ చెప్పారు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణ లేదన్నారు. చరణ్‌ కూడా కేవలం హాల్‌ వరకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పుకొచ్చారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన వెంటనే అక్కడి నుంచి తిరిగెళ్లిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాతనే అక్కడ పార్టీ మొదలైందని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో  అందరికీ తెలుసని  గుర్తుచేశారు. మాలలో ఉన్నప్పుడు బయట కనీసం నీళ్లు కూడా చరణ్‌ తీసుకోరని శిరీష్‌ తెలిపారు.

సుమారు 20ఏళ్లగా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మాలలో రామ్ చరణ్ కనిపిస్తూనే ఉంటారని అందరికీ తెలిసిందే. ఏడాదిలో కనీసం 100రోజులకు పైగానే ఆయన భక్తి మార్గంలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల తనను తాను క్రమశిక్షణగా ఉండటం కోసం ఆపై భక్తి మార్గంలో ఉండటం వల్ల మంచి జరుగుతుందని ఆయన గతంలో చెప్పారు. చరణ్‌ గురించి పూర్తి విషయాలు తెలీకుండానే ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement