breaking news
Ayyappa Mala
-
అయ్యప్ప మాలలో చరణ్.. పార్టీ వివాదంపై శిరీష్ క్లారిటీ
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్-నయనికల వివాహం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. అందులో రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అయ్యప్పమాలలో ఉన్న రామ్ చరణ్ మద్యం పార్టీలో పాల్గొనడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ సమాధానం ఇచ్చారు.చరణ్ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చారు. ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు సమాధానంగా ఆయన రిప్లై ఇచ్చారు. పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయారని అల్లు శిరీష్ చెప్పారు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణ లేదన్నారు. చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పుకొచ్చారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన వెంటనే అక్కడి నుంచి తిరిగెళ్లిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాతనే అక్కడ పార్టీ మొదలైందని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో అందరికీ తెలుసని గుర్తుచేశారు. మాలలో ఉన్నప్పుడు బయట కనీసం నీళ్లు కూడా చరణ్ తీసుకోరని శిరీష్ తెలిపారు.సుమారు 20ఏళ్లగా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మాలలో రామ్ చరణ్ కనిపిస్తూనే ఉంటారని అందరికీ తెలిసిందే. ఏడాదిలో కనీసం 100రోజులకు పైగానే ఆయన భక్తి మార్గంలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల తనను తాను క్రమశిక్షణగా ఉండటం కోసం ఆపై భక్తి మార్గంలో ఉండటం వల్ల మంచి జరుగుతుందని ఆయన గతంలో చెప్పారు. చరణ్ గురించి పూర్తి విషయాలు తెలీకుండానే ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు.#AlluArjun recently hosted a private celebration exclusively for his close friends and inner circle, creating a warm and intimate atmosphere away from the public eye. The gathering was said to be filled with laughter, bonding, and heartfelt conversations among longtime… pic.twitter.com/M6YtWxTFe2— Australian Telugu Films (@AuTelugu_Films) February 23, 2026 -
ముంబైలో సిద్ధి వినాయక ఆలయం రామ్ చరణ్ పూజలు..ఫోటోలు వైరల్
అయ్యప్ప స్వామికి రామ్ చరణ్ పెద్ద భక్తుడు. ప్రతి ఏడాది ఆయన అయ్యప్ప స్వామి మాలను స్వీకరించి దీక్ష తీసుకుంటాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న మాలను స్వీకరించడం మాత్రం మర్చిపోరు. ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్ష చేయటాన్ని విడిచి పెట్టలేదు. ఈ ఏడాది కూడా రామ్ చరణ్ దీక్షను తీసుకున్నాడు. తాజాగా ఈ దీక్షను ఆయన ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంత నిష్టగా ఉంటారో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఈ సమయంలో రామ చరణ్ కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అభిమానులను ఆకర్షించింది. ఒక వైపు వృతిపరమైన విషయాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను బ్యాలెన్స్ చేయటంలో రామ్ చరణ్ తన అంకిత భావాన్ని ప్రదర్శించారు. -
అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు ఇవే
-
అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఈ వస్తువులు ఉండాల్సిందే
-
మాల ధారణ సమయంలో నల్ల వస్త్రాలు ధరించడానికి కారణం అదే
-
అయ్యప్ప మాల వేసుకున్నాక ఏదైనా సమస్య వస్తే..?
-
అయ్యప్ప మాలధారణ .. నియమాల ఆచరణ.. మండల పూజ ఎప్పటినుంచంటే?
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప): శివకేశవుల తనయుడైన శ్రీమణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ. హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్షమార్గాన్ని అన్వేశించే వారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పని సరిగా జీవితంలో ఒక సారి అయినా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు. నియమాలు ఇలా.. అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో మాతృమూర్తి వద్ద వేయించుకోవచ్చును. ప్రతి రోజు సూర్యోదయంకు ముందే పూజలు, సూర్యాస్తమయం తరువాత పూజలు నిర్వహించాలి. కఠిన నియమాలను పాటిస్తూ నలుపు దుస్తులనే వాడాలి. రాత్రివేళల్లో ఆలయాలలోని నిద్రే శ్రేయస్కరం. ప్రతి రోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి. భక్తుడే భగవంతుడు అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌక్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై స్వామి గానే పిలువబడుతుంటారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికి, భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. ఇరుముడి ప్రాముఖ్యత అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్క్‌ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నెయ్యితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకరజ్యోతిగా భావించాలి. ఆద్యంతం భక్తిపారవశ్యమే.. శబరిమలై యాత్ర ఆధ్యంతం భక్తి పారవశ్యమే. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్‌స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుళ్లి ఆడి వావర్‌స్వామిని, పేటశాస్త్రిలను దర్శించుకుని పంబకు బయలుదేరుతారు. పంబానదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచిమేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. పంబానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తిఆల్కు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామి వారిని సన్నిధానానికి చేరుకుంటారు. పవిత్రమైన పదునెట్టాంబడి.. స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి ఎక్కవలెను. స్వామి వారి దర్శనార్థం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకాన్ని చేస్తారు. అనంతరం మాలిగైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలను దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుగా చెల్లించుకుంటారు. అద్వైత మలై.. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించినవాడే అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమలవెంకటేశ్వరస్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండల కాలం (41రోజులు) ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లను ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్లీ అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తులు. ఈ యేడాది నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేది వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. -
‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’
సాక్షి,సిటీబ్యూరో: పోలీస్ విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్ నిబంధనల మేరకు ఉద్యోగులు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వులను మాత్రమే తాము అమలు చేస్తున్నామ ని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ అన్నారు. కేవలం అయ్యప్ప భక్తుల విషయంలో తాజాగా ఏ నిర్ణయం తీసుకోలేదని, అయితే ఈ విషయంపై కొందరు రాచకొండ పోలీస్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని ప్రజలు నమ్మ రాదని, తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని సీపీ పేర్కొన్నారు. -
‘అమ్మ’ కోసం మంత్రి అయ్యప్పమాల
టీనగర్: అక్రమాస్తుల కేసుల నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత బయటపడాలని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టి మంత్రి వలర్మతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా 31 మంది మహిళలు కూడా ఇరుముడి కట్టారు. జయలలిత కేసుల నుంచి బయటపడాలని అన్నాడీఎంకే వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. మంత్రి వలర్మతి అయ్యప్ప మాల ధరించారు. శుక్రవారం ఉదయం మహాలింగపురం అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టారు. వలర్మతితోపాటు 32 మంది మహిళా నిర్వాహకులు ఇరుముడి కట్టారు. తర్వాత ఇరుముడి తలపై మోసుకుంటూ ఆలయూనికి వచ్చారు. అక్కడ నుంచి రాజా అన్నామలైపురం అయ్యప్ప ఆలయానికి యాత్రగా వెళ్లారు. అక్కడ అయ్యప్పకు పూజలు చేశారు. తర్వాత ఇరుముడి సమర్పించి నెయ్యితో అభిషేకం చేశారు. జయలలిత పేరిట పూజలు చేశారు. ఇందులో కౌన్సిలర్లు నుంగై మారన్, డి.శివరాజ్, ఆరుముగం పాల్గొన్నారు.


