
‘అమ్మ’ కోసం మంత్రి అయ్యప్పమాల
అక్రమాస్తుల కేసుల నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత బయటపడాలని అయ్యప్ప
టీనగర్: అక్రమాస్తుల కేసుల నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత బయటపడాలని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టి మంత్రి వలర్మతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా 31 మంది మహిళలు కూడా ఇరుముడి కట్టారు. జయలలిత కేసుల నుంచి బయటపడాలని అన్నాడీఎంకే వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. మంత్రి వలర్మతి అయ్యప్ప మాల ధరించారు. శుక్రవారం ఉదయం మహాలింగపురం అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టారు.
వలర్మతితోపాటు 32 మంది మహిళా నిర్వాహకులు ఇరుముడి కట్టారు. తర్వాత ఇరుముడి తలపై మోసుకుంటూ ఆలయూనికి వచ్చారు. అక్కడ నుంచి రాజా అన్నామలైపురం అయ్యప్ప ఆలయానికి యాత్రగా వెళ్లారు. అక్కడ అయ్యప్పకు పూజలు చేశారు. తర్వాత ఇరుముడి సమర్పించి నెయ్యితో అభిషేకం చేశారు. జయలలిత పేరిట పూజలు చేశారు. ఇందులో కౌన్సిలర్లు నుంగై మారన్, డి.శివరాజ్, ఆరుముగం పాల్గొన్నారు.