
అయ్యప్ప స్వామికి రామ్ చరణ్ పెద్ద భక్తుడు. ప్రతి ఏడాది ఆయన అయ్యప్ప స్వామి మాలను స్వీకరించి దీక్ష తీసుకుంటాడు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న మాలను స్వీకరించడం మాత్రం మర్చిపోరు. ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ వంటి భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్ష చేయటాన్ని విడిచి పెట్టలేదు.
ఈ ఏడాది కూడా రామ్ చరణ్ దీక్షను తీసుకున్నాడు. తాజాగా ఈ దీక్షను ఆయన ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు.
అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంత నిష్టగా ఉంటారో మనం గమనిస్తే అర్థమవుతుంది. ఈ సమయంలో రామ చరణ్ కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తారు. అయ్యప్ప మాలతో నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు.
సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను పాటించటం అనేది అభిమానులను ఆకర్షించింది. ఒక వైపు వృతిపరమైన విషయాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలను బ్యాలెన్స్ చేయటంలో రామ్ చరణ్ తన అంకిత భావాన్ని ప్రదర్శించారు.