సత్యతో వరుణ్ తేజ్ కామెడీ.. సంక్రాంతి ఫన్నీ అప్‌డేట్ | Varun Tej Latest Movie VT15 Sankranthi Funny Promo out now | Sakshi
Sakshi News home page

Varun Tej: 'హిరో కంటే నాకే ఎక్కువ డైలాగులు ఉన్నాయి'.. వీటీ15 సంక్రాంతి అప్‌డేట్

Jan 15 2026 6:51 PM | Updated on Jan 15 2026 6:58 PM

Varun Tej Latest Movie VT15 Sankranthi Funny Promo out now

వరుణ్‌ తేజ్‌ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ జనవరి 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా కమెడియన్‌ సత్యతో ఓ ఫన్నీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఏంటి ఇన్నీ డైలాగులు ఉన్నాయి నాకు అంటూ సత్య కంగారుపడుతూ కనిపించారు. ఇందులో కొరియా భాషల్లో ఉన్న డైలాగ్‌ను చూసి కొరియన్స్‌కు వీడియో కాల్‌ చేసిన ఫన్నీ ఆడియన్స్‌కు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వరుణ్‌ సందేశ్‌ ఫోన్ చేసి ఆ డైలాగ్‌ గురించి ఆరా తీస్తాడు. ఈ వీడియో అభిమానులకు ఫుల్ కామెడీని పంచుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement