రోడ్డు ప్రమాదంలో నటి.. కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో.. | Actress Devi Priya Car Accident On National Highway | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నటి.. కారు టైర్‌ పంక్చర్‌ కావడంతో..

Mar 3 2026 8:38 AM | Updated on Mar 3 2026 8:52 AM

Actress Devi Priya Car Accident On National Highway

తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదంలో బుల్లితెర నటి దేవి ప్రియ(38) ప్రమాదానికి గురయ్యారు.  ఆమె కేవలం సీరియల్స్‌లలో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నై నుంచి ఒక  కార్యక్రమంలో పాల్గొనేందుకు థేని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెరంబలూర్‌ వద్ద తన కారు టైరు పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ ముత్తుగణేశ్‌(38) రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తున్న క్రమంలో అటువైపు వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి దేవిప్రియ కారును బలంగా ఢీకొంది. 

దీంతో కారు డ్రైవర్‌ ముత్తుగణేశ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, కారుకు కొద్ది దూరంలో నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆమె సహాయకుడు దివాకర్‌ (36) తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్థానికులు పెరంబలూర్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement