గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన వార్ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్ కీలక పాత్రల్లో నటించారు.


