కాంత్ తనయుడు రోషన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ఛాంపియన్. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్‌లో తన నటనతో రోషన్ మంచి మార్కులు కొట్టేశారు.
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. గిర గిర గింగిరాగిరే అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో ఊపేసింది. తాజాగా ఈ సూపర్ హిట్ ఫుల్ వీడియో సాంగ్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రోషన్- అనస్వర రాజన్ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.
కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజైన మూడురోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.


