35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో!
మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కల్యాణ్ చక్రవర్తి( వెండితెరపై కనిపించనున్నారు. రోషన్, అనస్వరా రాజన్ హీరో హీరోయిన్లుగా, కల్యాణ్ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ మూవీ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కీలకమైన రాజి రెడ్డి పాత్రలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి(Nandamuri Kalyan Chakravarthy) నటించినట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘1980లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన కల్యాణ్ చక్రవర్తి మా ‘ఛాంపియన్’ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. చిరంజీవిగారి ‘లంకేశ్వరుడు’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన తర్వాత, ఆయన నటన నుంచి విరామం తీసుకుని, మళ్లీ 35 ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు’’ అని యూనిట్ పేర్కొంది.