పట్టుమని పాతికేళ్లు లేవు. అయితేనేం సొంత భాషలో హీరోయిన్‌గా స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్‌లోనూ ఓ మూవీ చేసింది. ఇప్పుడు 'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?
పైన చెప్పిందంతా కూడా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ గురించే. కేరళలోని కరివెల్లూరులో పుట్టిన ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ 15 ఏళ్ల వయసులో 'ఉదాహరణం సుజాత' అనే మూవీలో మంజు వారియర్ కూతురిగా నటించింది. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగళ్' చిత్రం అనస్వరకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే ఏడాది వచ్చిన 'అధ్యరాత్రి'లో ఈమె తల్లి, కూతురిగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ రోల్స్ చేసేనాటికి ఈమె వయసు 17 ఏళ్లే కావడం విశేషం.
(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)
2022లో వచ్చిన 'సూపర్ శరణ్య' సినిమా అనస్వరకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులోనే మమిత బైజు కూడా యాక్ట్ చేసింది. ఇదే ఏడాది తమిళంలోకి 'రాంగీ'తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే వర్కౌట్ కాలేదు. 2023లో 'యారియన్ 2'తో బాలీవుడ్‌కి కూడా పరిచయమైంది. ఇది కూడా కలిసి రాలేదు. దీంతో తమిళ, హిందీలో మరో చిత్రంలో నటించలేదు. కేవలం మలయాళానికి మాత్రమే పరిమితమైపోయింది.
2023లో వచ్చిన 'నెరు' సినిమాతో అనస్వర ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసింది. కళ్లు లేని అమ్మాయిగా, తనపై అత్యాచారం చేసివాడిని పట్టించే పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీకిగానూ ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ ఈమెని వరించాయి. గతేడాది వచ్చిన 'గురువాయూర్ అంబలనడయిల్', ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'రేఖాచిత్రం' ఈమెలోని ప్రతిభని మరింత బయటపెట్టాయి.
శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన 'ఛాంపియన్'తో అనస్వర.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. నెరు, రేఖాచిత్రం, సూపర్ శరణ్య తదితర చిత్రాల్ని ఓటీటీల్లో మనోళ్లు ఇప్పటికే చూశారు. వాళ్లందరికీ ఈ బ్యూటీ టాలెంట్ ఏంటనేది తెలుసు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా అన్నీ అదరగొట్టే ఈమెకు 'ఛాంపియన్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)


