పవన్‌ కల్యాణ్‌కు జోడీగా స్టార్‌ హీరోయిన్‌.. వివాదం ఎందుకు? | pawan kalyan and surender reddy movie will be heroin choice trending | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌కు జోడీగా స్టార్‌ హీరోయిన్‌.. వివాదం ఎందుకు?

Feb 8 2026 3:24 PM | Updated on Feb 8 2026 3:34 PM

pawan kalyan and surender reddy movie will be heroin choice trending

సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ - సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మూవీ గురించి నిర్మాత రామ్‌ తాళ్లూరి   కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. పవన్‌ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మార్చి 26న విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత తదుపరి ఆయన చేయనున్నది సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమానే కావడం విశేషం. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎంపిక గురించి మరోసారి విమర్శలు వస్తున్నాయి.

‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్‌ను పవన్‌కు జోడీగా సురేందర్‌ రెడ్డి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇమాన్వీ ఎంపికను తప్పుబడుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫౌజీ మూవీలో ఇమాన్వీని తీసుకుంటున్నట్లు ప్రకటన వచ్చిన సమయంలో కూడా ఇలాంటి వివాదమే రేగింది.  తన మూలాలు పాకిస్థాన్‌కు చెంది ఉన్నాయని మరికొందరు గుర్తు చేస్తున్నారు. 

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఉన్న సంబంధాలన్నీ కూడా భారత్‌ తెంచుకుంది.  పాకిస్థాన్‌ నటులు, సినిమాలపై కూడా నిషేధం విధించాలనే డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్‌ మూవీకి ఇమాన్వీని తీసుకోనున్నారని వార్తలు రావడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ఇమాన్వీ ఎంపిక అంశం గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.

నాది పాకిస్థాన్‌ కాదు
ఫౌజీ సినిమా సమయంలో కూడా ఇమాన్వీ ప్రాంతీయత గురించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాను పాకిస్థానిని కాదని, భారతీయ అమెరికన్‌ని అని గర్వంగా చెప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు  తన మూలాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు.  ' పాకిస్థాన్‌తో నా కుటుంబం సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని కొందరు నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. 

నేను చాలా క్లియర్‌గా హిందీతో పాటు తెలుగు, గుజరాతీ మాట్లాడగలనని గర్వంగా చెబుతాను. నేను పుట్టింది లాస్‌ ఏంజెలిస్‌లో.. చాలా ఏళ్ల క్రితమే నా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు ఎప్పుడో అమెరికన్‌ సిటిజన్స్‌గా గుర్తింపు పొందారు. నేను చదివింది కూడా అమెరికాలోనే.. సినిమాలపై ఆసక్తితో నా చదువు పూర్తయ్యాక కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ని ప్రారంభించాను. ఫైనల్‌గా భారతీయ చిత్రపరిశ్రమలో అవకాశాల్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది.' అంటూ గతంలో ఇమాన్వీ తన గురించి క్లారిటీ ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement