breaking news
Imanvi
-
ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన
ప్రభాస్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. నేడు (అక్టోబర్ 23) డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 1930వ దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా వాటికి కొంత ఫిక్షన్ జోడించి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో కొత్త భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్స్ నటిస్తున్నారు.మన చరిత్రలోని దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. ప్రభాస్‌ను ఫౌజీగా పరిచయం చేయడంలో తనకు చాలా గర్వంగా ఉందన్నారు. 'ఇప్పటివరకు ఈ ప్రయాణం మరపురానిది.. ఫౌజీ నుంచి ఈ జర్నీ మరింత పెద్దదిగా ఉంటుందని హామీ ఇస్తున్నా' అంటూ హను పోస్ట్ చేశారు.ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సగంపైగానే పూర్తి అయింది. ఫస్ట్ షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారణ టాక్. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. पद्मव्यूह विजयी पार्थःपाण्डवपक्षे संस्थित कर्णः।गुरुविरहितः एकलव्यःजन्मनैव च योद्धा एषः॥#PrabhasHanu is #FAUZI ❤🔥The bravest tale of a soldier from the hidden chapters of our history 🔥Happy Birthday, Rebel Star #Prabhas ❤️#HappyBirthdayFAUZI#HappyBirthdayPRABHAS… pic.twitter.com/bwv4PPAtiB— Fauzi (@FauziTheMovie) October 23, 2025 -
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
'ఫౌజీ' బ్యూటీ హైదరాబాద్ టూర్.. 'మిరాయ్' భామ ఇలా
హైదరాబాద్‌లో తిరిగేస్తున్న ప్రభాస్ 'ఫౌజీ' బ్యూటీ ఇమాన్విమెరిసిపోతున్న 'మిరాయ్' భామ రితికా నాయక్సంప్రదాయ బద్ధంగా గ్లామర్ చూపిస్తున్న రాశీఖన్నానవ్వుతూ హ్యాపీగా ఉన్న హీరోయిన్ అంజలిబీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మీపింక్ డ్రస్సులో పూజా హెగ్డే నవ్వులు చిందిస్తూ View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) -
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్‌పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.తీవ్రంగా ఖండిస్తున్నా..ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.దుష్ప్రచారందీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.నా రక్తంలోనూ..USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!