
ప్రభాస్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. నేడు (అక్టోబర్ 23) డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 1930వ దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా వాటికి కొంత ఫిక్షన్ జోడించి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో కొత్త భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్స్ నటిస్తున్నారు.

మన చరిత్రలోని దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. ప్రభాస్‌ను ఫౌజీగా పరిచయం చేయడంలో తనకు చాలా గర్వంగా ఉందన్నారు. 'ఇప్పటివరకు ఈ ప్రయాణం మరపురానిది.. ఫౌజీ నుంచి ఈ జర్నీ మరింత పెద్దదిగా ఉంటుందని హామీ ఇస్తున్నా' అంటూ హను పోస్ట్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సగంపైగానే పూర్తి అయింది. ఫస్ట్ షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభమైంది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారణ టాక్. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
पद्मव्यूह विजयी पार्थः
पाण्डवपक्षे संस्थित कर्णः।
गुरुविरहितः एकलव्यः
जन्मनैव च योद्धा एषः॥#PrabhasHanu is #FAUZI ❤🔥
The bravest tale of a soldier from the hidden chapters of our history 🔥
Happy Birthday, Rebel Star #Prabhas ❤️#HappyBirthdayFAUZI#HappyBirthdayPRABHAS… pic.twitter.com/bwv4PPAtiB— Fauzi (@FauziTheMovie) October 23, 2025