ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి నుంచి 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం తొలుత ట్రైలర్, తర్వాత ఓ పాటని రిలీజ్ చేశారు. అలానే ఓవర్సీస్‌లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఓటీటీ డీల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్)
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీసిన హారర్ ఫాంటసీ మూవీ ఇది. కొన్నాళ్ల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కంటెంట్ ఏంటనేది చూచాయిగా క్లారిటీ వచ్చేసింది. హారర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టింది. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉండిపోయింది.
ఇప్పుడన్నీ సమస్యలన్నీ క్లియర్ కావడంతో 'రాజాసాబ్' డిజిటల్ హక్కుల్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ.. భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి 6 వారాలకు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే 8 వారాలకు కుదుర్చుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)


