పాన్ ఇండియా సినిమాల్లో 'నంబర్ వన్ హీరో' అంటే అందరూ చెప్పే మొదటి పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత అతని ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ఫ్లాప్ సినిమాలు వచ్చినా, అతని చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. ఈ ఇమేజ్ వల్లే ప్రభాస్ పారితోషికం కూడా ఆకాశాన్ని తాకింది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో అతడే. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 100-120 కోట్లు తీసుకుంటున్నాడు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ ఇదే స్థాయిలో పుచ్చుకుంటున్నాడు. ఇది అందరికి తెలిసిన పాత వార్తే. కానీ, ఇప్పుడు మరోసారి ప్రభాస్(Prabhas) పారితోషికం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. స్పిరిట్ సినిమాకు ఆయన ఇంకాస్త ఎక్కువే తీసుకుంటున్నాడట. ఈ చిత్రానికి అత్యధికంగా రూ.160 కోట్లకుపైగా పారితోషికం(Remuneration) తీసుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్. ప్రభాస్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ సంస్థలు ఆ స్థాయితో పారితోషికం అందిస్తున్నాయి.
స్పిరిట్ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి.సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మాతలు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


