హీరోగా మారిన ఆర్జీవీ.. టైటిల్‌ ఇదే! | Ram Gopal Varma Turns As A Actor, Play Lead Role In Show Man Movie | Sakshi
Sakshi News home page

హీరోగా మారిన ఆర్జీవీ.. టైటిల్‌ ఇదే!

Dec 5 2025 1:00 PM | Updated on Dec 5 2025 1:26 PM

Ram Gopal Varma Turns As A Actor, Play Lead Role In Show Man Movie

దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షో మ్యాన్’. ‘మ్యాడ్ మాన్స్టర్’ అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. ‘నూతన్’ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు. 

ఆర్జీవీతో ఇంతకుముందు ‘ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2’ చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి... భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement