breaking news
tummalapalli rama satyanarayana
-
పంద్రాగస్టుకి పదిహేను చిత్రాలకు శ్రీకారం
భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ పదిహేను సినిమాల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ‘జస్టిస్ ధర్మ’ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించనుండగా, ‘నాగపంచమి’కి ఓం సాయిప్రకాశ్, ‘నా పేరు పవన్ కల్యాణ్’కి జేకే భారవి, ‘టాపర్’కి ఉదయ్ భాస్కర్, ‘కేపీహెచ్‌బీ కాలనీ’కి తల్లాడ సాయికృష్ణ, ‘పోలీస్ సింహం’కి సంగకుమార్, ‘అవంతిక–2’కి శ్రీరాజ్ బళ్లా, ‘యండమూరి కథలు’కి రవి బసర, ‘బి.సి’ (బ్లాక్ కమాండో)కి మోహన్ కాంత్, ‘హనీ కిడ్స్’కి హర్ష, ‘సావాసం’కి ఏకరి సత్యనారాయణ, ‘డార్క్ స్టోరీస్’కి కృష్ణ కార్తీక్, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’కి బి. శ్రీనివాసరావు, ‘ది ఫైనల్ కాల్’కి ప్రణయ్ రాజ్ వంగరి, ‘అవతారం’ సినిమాకి డా. సతీష్ దర్శకత్వం వహించనున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2025, ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలను 2026 ఆగస్టు 15కి పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్‌లో నమోదు చేశాయి’’ అని చెప్పారు. -
ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని కథ తో సినిమా..!
-
ఒకే రోజు 15 సినిమాలు.. దర్శకులు వీళ్లే
ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రపంచ రికార్డు సాధించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న భీమవరం టాకీస్ అధినేత - శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ వెనుక తాము ఉంటామని తెలిపారు... ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రఖ్యాత రచయిత జె.కె.భారవి. ఈనెల (ఆగస్టు) 15న హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఒకేసారి ప్రారంభమై ప్రపంచ రికార్డు" నెలకొల్పనున్న 15 సినిమాలకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా సంఘీభావం తెలిపారు.ఈ 15 చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ ప్రకటించగా... ఈ 15 చిత్రాల్లో యండమూరి సినిమా మినహా... మిగతా సినిమాలకు తాను స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించి తగిన సలహాలు, సూచనలు ఇస్తానని జె.కె.భారవి పేర్కొన్నారు. రామసత్యనారాయణను చూసి తాను గర్వపడుతుంటానని రేలంగి తెలిపారు. ఈ 15 చిత్రాలకు స్టూడియో పార్టనర్ గా ఉండే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్. కెరీర్ బిగినింగ్ లొనే 12 నెలల్లో 13 సినిమాలు తీసి, విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసిన తనకు...ఒకేసారి 15 సినిమాలు స్టార్ట్ చేసి, ఏడాదిలోపు పూర్తి చేసి విడుదల చేయడం ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఈ 15 సినిమాల్లో... యండమూరి వీరేంద్రనాధ్ వంటి మహా రచయిత చిత్రంతోపాటు... జె.కె.భారవి వంటి మహాజ్ఞాని చిత్రం... ప్రఖ్యాత దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చిత్రం ఉండడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి చెప్పారు. ఈ 15 చిత్రాల్లో కేవలం రెండుమూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నా... తాను పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ఆయన వివరించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించే 15 సినిమాల దర్శకులు వీళ్లేయండమూరి వీరేంద్రనాథ్ సాయి ప్రకాష్జె.కె. భారవిఉదయ భాస్కర్తల్లాడ సాయి కృష్ణసంగ కుమార్శ్రీరాజ్ బళ్ళచిన్నిమోహన్ కాంత్హర్షఎకారి సత్యనారాయణకార్తిక్బి. శ్రీనివాసరావుప్రణయ్రాజ్ వంగరిసతీష్ (PhD) -
ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం.. ప్రపంచ రికార్డు
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘దివంగత నిర్మాత డి. రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ నిర్మాతగా ఆ ఘనత నా సొంతమైంది. మా భీమవరం టాకీస్‌పై ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించనున్నాను. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్నాను. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబాద్‌లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమాతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. -
ఐస్‌క్రీమ్ 3: ఆర్జీవీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను
‘ఐస్‌క్రీమ్, ఐస్‌క్రీమ్ 2’ వంటి చిత్రాల తర్వాత రామ్‌గోపాల్ వర్మ- తుమ్మలపల్లి రామసత్యనారాయణ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రకటన వచ్చింది. 2014 జూలై 14న ‘ఐస్‌క్రీమ్’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం విడుదలై ఏడేళ్లయిన సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ, తన కాంబినేషన్లో మూడో సినిమాను ప్రకటించారు రామసత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఐస్‌క్రీమ్’ చిత్రం నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు నా జాతకాన్ని కూడా మార్చింది. అతి త్వరలో ఆర్జీవీ దర్శకత్వంలో మూడో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. ఆర్జీవీ నాపై చూపించే అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు. -
పెద్ద బడ్జెట్ సినిమా తీయను
‘‘జీవితంలో ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమా తీసే ఆలోచన లేదు. నా తుది శ్వాస వరకు చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూనే ఉంటాను’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అన్నారు. నేడు ఆయన 63వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘2004లో నేను మొదటి సినిమా తీశాను. ఇప్పటికి 98 సినిమాలు పూర్తి చేశాను. 99వ చిత్రం రామ్‌గోపాల్ వర్మతో ఉంటుంది. నూరవ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఒక శతాధిక దర్శకుడు మాట ఇచ్చారు. 101వ సినిమాగా ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమా స్టార్ట్ చేస్తాను. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి శిష్యుడు ఉదయభాస్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి జేకే భారవి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ కరోనా ప్రభావం తగ్గాక 102వ చిత్రం ఉంటుంది. దీనికి సాయి ప్రకాష్‌గారు దర్శకుడు. చిన్న సినిమాలకు ఓటీటీ/ఏటీటీలే మార్గం. పెద్ద సినిమాలు థియేటర్లో చూస్తే ఆ థ్రిల్, ఆ అనుభూతి బాగుంటుంది’’ అన్నారు. -
చిన్న చిత్రాలకు శాశ్వత పరిష్కారం
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ హవా కొనసాగుతోంది. ప్రేక్షకులు కూడా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలువురు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తున్నారు. తాజాగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘మా ‘భీమవరం టాకీస్’ పేరుతో ఒక ఓటీటీ యాప్‌ని తీసుకొస్తున్నాం. అంతేకాదు.. మారుతున్న టెక్నాలజీతో మనం మారుదామంటూ సినిమా జీనియస్ రామ్‌గోపాల్ వర్మ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) అనే సరికొత్త మార్గాన్ని వెలికితీశారు. ఈ రంగంలోకి కూడా భీమవరం టాకీస్ అడుగుపెడుతోంది. ఏటీటీ వల్ల చిన్న సినిమా విడుదల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చిన్న బడ్జెట్ నిర్మాతల కోసం నిర్మాతల మండలి కూడా ఇలాంటి ఓటీటీ యాప్‌ని త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అన్నారు. -
థ్రిల్ చేస్తుంది
సాగర్ శైలేష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రహస్యం’. శ్రీ రితిక కథానాయికగా. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్ర చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లేదని, థియేటర్లు దొరకటం లేదని అంటుంటారు. ఇందులో కొంత వాస్తవం ఉన్నా పూర్తిగా కాదు. చిన్న సినిమాల్లో ఎన్నో చిత్రాలు బాగా ఆడుతున్నాయి. మంచి చిత్రాలకు థియేటర్స్ దొరుకుతున్నాయి. అందుకు నేను నిర్మించిన చిన్న చిత్రాలే ఉదాహరణ. కొత్త తరహా కథాంశంతో, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రమిది. సాగర్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా చక్కని ప్రతిభ కనబర్చారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు, టీజర్లకు స్పందన బాగుంది’’ అన్నారు. -
ధన్‌రాజ్ నమ్మిన కథ
‘‘నేను 70 సినిమాల్లో కష్టపడి సంపాదించిందంతా పెట్టుబడిగా పెట్టి ఈ సినిమా స్టార్ట్ చేశా. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను నమ్మిన కథ ఇది’’ అని నటుడు ధన్‌రాజ్ చెప్పారు. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వంలో మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కొడాలి వెంకటేశ్వరరావు, మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, శ్రీముఖి తదితరులు ఆకాంక్షించారు. -
ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు?
‘రక్తచరిత్ర’ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఓబుల్‌రెడ్డికి ఎలా స్పాట్ పెట్టారు? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్? ఈ ప్రశ్నలకు సమాధానంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పాట్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మూడో షెడ్యూల్‌కి చేరుకుంది. ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.