ఎన్నో అవమానాలు.. ఈ స్థాయికి వస్తాననుకోలేదు: నిర్మాత ఎమోషనల్‌ | Tummalapalli Rama Satyanarayana Breaks World Record with 15 Films in One Day | Celebrates 20 Years in Film Industry | Sakshi
Sakshi News home page

ఇది నేను కలలో కూడా ఊహించలేదు, ఈ స్థాయికి రావడానికి..

Sep 9 2025 4:10 PM | Updated on Sep 9 2025 4:14 PM

Tummalapalli Rama Satyanarayana Gets Emotional Over His Career

ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం

నిర్మాతగా డబుల్ సెంచరీ సాధించడం నా జీవితాశయం

వరల్డ్ రికార్డ్ హోల్డింగ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ

అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

15 సినిమాలు
తన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో "యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ" చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. 

ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్‌
ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు  తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!! తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు... ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement