వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం(డిసెంబర్ 18, 2025) ఆ పార్టీ కీలక సమావేశం జరిగింది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతంగా పూర్తి కావడంపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్యకర్త నుంచి కీలక నేత దాకా ఈ కార్యక్రమం కోసం చేసిన కృషిని ఆయన అభినందించారు.
అదే సమయంలో చంద్రబాబు సర్కార్‌పైనా ఆయన ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొన్నారు.


