వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం(నవంబర్ 26, 2025) బ్రాహ్మణపల్లిలో పర్యటించారు. నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి అక్కడి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయం దండగగా భావిస్తున్న సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.


